Tsrtc Strike : ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

-ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ -మరోసారి కౌంటర్ దాఖలు చేయనున్న ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాలు -గతంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి -కార్మికుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించనున్న కార్మిక సంఘాలు -11 రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Update: 2019-10-15 02:58 GMT

మరోవైపు ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాలు మరోసారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నారు. గతంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఇలాఉంటే కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు‌కు కార్మిక సంఘాలు నివేదిక సమర్పించనున్నాయి. సమ్మె నివారణ, ప్రజల ఇబ్బందులపై న్యాయవాది రాపోలు భాస్కర్ మరో పిల్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్‌లు కలిపి నేడు హైకోర్టు మరోసారి విచారించనుంది. 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టారు. అయితే ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో సమ్మె ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేకే ద్వారా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News