చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూడొద్దు : హైకోర్టు

Update: 2019-09-09 11:24 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ నెల 11కు కేసును వాయిదా వేసింది. బుధవారం మరోసారి పూర్తి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 

Tags:    

Similar News