ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2019-10-15 11:36 GMT

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఇప్పుడు సమ్మె విరమిస్తే సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని యూనియన్ల తరపున పిటిషనర్ వాదనలు వినిపించారు. సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేరని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదన్నారు. పండగలు, పాఠశాలలు ఉన్న సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది..ప్రభుత్వం యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని కోర్టు కామెంట్ చేసింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని తక్షణం సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడమే మంచిదని సూచించింది. నిరసనలకు ఎన్నో పద్ధతులుండగా, సమ్మె చేయడం తగదని అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సర్కార్ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగటంలేదని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశామనీ సర్కార్ కోర్టుకు వివరించింది. విలీనం అసాధ్యమని.. ఆర్టీసీని విలీనం చేస్తే ఇతర కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్ ను తెరపైకి తెచ్చే ఆస్కారముందని ప్రభుత్వం వివరించింది. ఇక సమ్మెపై తమ వైఖరి వెల్లడించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె విరమిస్తే.. తమ సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేనందున తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని యూనియన్లు కామెంట్ చేశాయి. ఇరు వర్గాలు పంతాలు మాని చర్చలు జరపడం మంచిదని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా పడింది. 

Tags:    

Similar News