తెలంగాణలో 14మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం..!

* అడిషనల్ కలెక్టర్లుగా కొత్తవారికి పోస్టింగ్.. నాన్‌ కేడర్ అధికారులను సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్

Update: 2022-11-08 01:55 GMT

తెలంగాణలో 14మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం

TS Government: తెలంగాణలో 14 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కొత్త అధికారులను నియమించారు. స్థానిక సంస్థల బలోపేతానికి తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న అడిషనల్ కలెక్టర్ల స్థానాల్లో కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా అపూర్వ చౌహాన్ నియమించారు. అశ్వినీ తానాజీ వాకడేను వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పోస్టింగిచ్చారు.

సాధారణ పరిపాలన విభాగానికి హరిసింగ్‌ను బదిలీ చేశారు. హరిసింగ్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా రిపోర్ట్ చేయమని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా రాహుల్, నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గా మయాంక్ మిట్టల్, నారాయణపేటలో పనిచేస్తున్న కందుకూరి చంద్రారెడ్డిని సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేశారు. జగిత్యాల జిల్లాలో నాన్ కేడర్ లో పనిచేస్తున్న అరుణశ్రీని సాధారణ పరిపాలన విభాగానికి బదిలీచేసినా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా మందా మకరందుకు పోస్టింగ్ ఇచ్చారు. జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ప్రఫుల్ దేశాయ్‌కు కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ నాన్ కేడర్‌ అధికారిగా పనిచేస్తున్న అబ్దుల్ హమీద్‌ను సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ గా అభిషేక్ అగస్త్యకు కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలో నాక్ కేడర్ అధికారిగా పనిచేస్తున్న జాన్ శామ్‌సన్‌ను సాధారణ పరిపాలన విభాగానికి బదిలీచేశారు. నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా కష్బూ గుప్తాకు కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న రాహుల్ శర్మను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

Tags:    

Similar News