Telangana News: కులవృత్తులు, చేతివృత్తుల‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష సాయం.. అప్లై చేసుకోండిలా..

Telangana News: కులవృత్తులు, చేతివృత్తుల‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష సాయం.. అప్లై చేసుకోండిలా..

Update: 2023-06-06 11:00 GMT

Telangana News: కులవృత్తులు, చేతివృత్తుల‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష సాయం.. అప్లై చేసుకోండిలా..

Telangana News: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తుల‌పై ఆధారపడిన వారికి రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మంగళవారం ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న ₹లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది.

Tags:    

Similar News