Half-day schools timings: ఒక్కపూడి బడి టైమింగ్స్... మధ్యాహ్న భోజనం ఉంటుందా?

Half-day schools and summer holidays in Telangana: తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ ఏంటి, సమ్మర్ హాలీడేస్ ఎప్పుడు..

Update: 2025-03-12 10:30 GMT

Half-day schools timings: ఒక్కపూడి బడి టైమింగ్స్... మధ్యాహ్న భోజనం ఉంటుందా?

Half-day schools in Telangana : తెలంగాణ ప్రభుత్వం హాఫ్ డే స్కూల్ నిర్వహణకు తేదీ, టైమింగ్స్ ఖరారు చేసింది. మార్చి 15 నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం వరకే బోధన జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ కచ్చితంగా అసుసరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విద్యా శాఖ సూచించింది.

హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్

ప్రతీరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం లోపం లేకుండా ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం అలాగే కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. 

సమ్మర్ హాలీడేస్

ఏప్రిల్ 23 వరకు తరగతులు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అదే చివరి రోజు కానుంది. ఏప్రిల్ 24వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ కాగా జూన్ 12న కొత్త విద్యా సంవత్సరంలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.

భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా మధ్యాహ్నం తరువాత ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వారి పనివేళలను అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News