ముస్లింలకు గవర్నర్‌, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

Update: 2020-05-25 02:25 GMT

రంజాన్‌ పండుగ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజల్లో సుఖసంతోషాలను నింపుతుందని పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రంజాన్‌ను ఇళ్లలోనే జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సహనాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. 

రంజాన్‌ జీవన పరమార్థాన్ని తెలియజేస్తుందని, కఠిన స్వీయ క్రమశిక్షణను నిర్దేశిస్తుందని గవర్నర్‌ చెప్పారు. పవిత్ర ఖురాన్‌ బోధనలు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు. కొవిడ్‌ ను ఎదుర్కొనే ైస్థెర్యాన్ని రంజాన్‌ పర్వదినం అందిస్తుందని తెలిపారు. ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు.

 

 

Tags:    

Similar News