తెలంగాణ రాష్ట్రంలో జనగణన ఎప్పుడో తెలుసా ?

ఈ ఏడాదిలో జాతీయ 16వ జనగణను ఏప్రిల్‌ 1 నుంచి చేపట్టనున్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-02-23 05:02 GMT

ఈ ఏడాదిలో జాతీయ 16వ జనగణను ఏప్రిల్‌ 1 నుంచి చేపట్టనున్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జనగణన కోసం నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముందస్తుగానే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగాంగా ప్రజల వివరాల సేకరించేందుకు ప్రతిసారి చేసినట్టుగా పెన్ను, పేపర్‌ను ఉపయోగించి గణన చేయకూడదని, సమాచారాన్ని మొబైల్‌ ఫోన్‌ యాప్‌తోనే నిక్షిప్తం చేయాలన్న జాతీయ జనగణన డైరెక్టరేట్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇక పోతే గణన చేసేందుకు 2021 డిసెంబర్‌ వరకు రిటైర్మెంట్‌ లేని గ్రూప్‌–1 అధికారులను ఇందుకోసం ఎంచుకుని వీరికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాతి దశలో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు, గణాంక అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. వీరందరూ కలిసి జనగణన సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఎన్యూమరేటర్లను పర్యవేక్షించనున్నారు. ఎన్యూమరేటర్లుగా మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇక మొదటి అంచెలో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మాస్టర్‌ ట్రైనర్లను నియమిస్తున్నారు. దీంతోపాటు జనగణన చేపట్టే విధానానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. కాగా ఈ జనగణనలో ప్రజల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన పట్టికను ఇప్పటికే జాతీయ జనగణన డైరెక్టరేట్‌ విడుదల చేశారు. ఆ వివరాలను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో పునర్ముద్రించింది. కానీ ఇప్పటివరకూ చేపట్టే తేదీలను అధికారికంగా వెల్లడించలేదు.

Tags:    

Similar News