రెండో శనివారం సెలవు రద్దు.. యధాతథంగా జీహెచ్ఎంసీ కార్యాలయాలు

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగుకలు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రతి నెలలో రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది.

Update: 2020-02-08 08:04 GMT

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగుకలు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రతి నెలలో రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆరంభంలో జనవరి 1వ తేదీన కార్యాలయాలకు సెలవు ప్రకటించినందుకు గాను ఈ రోజున అంటే ఫిబ్రవరి 8వ తేదీన రెండో శ‌నివారాన్ని ప‌నిదినంగా ప‌రిగ‌నించాలని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ రెండో శ‌నివారం అయినప్పటికీ అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌నిచేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపారు.

ఇక ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు అన్ని జోన‌ల్‌, స‌ర్కిల్ కార్యాల‌యాలు య‌దావిధిగా ప‌నిచేయాల‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గురించి జోన‌ల్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, హెచ్‌.ఓ.డిలు త‌మ ప‌రిధిలో పనిచేసే అన్ని క్యాటగిరీల ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీచేయాల‌ని అదికారులకు సూచించారు.

ఇకపోతే గతంలో కూడా ప్రభుత్వం ఒక సారి ఇదే విధంగా రెండో శనివారం సెలవులను రద్దు చేసింది. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా సమయంలో నిరవధిక సమ్మెను చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాఠశాలలకు దసరా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. తరువాత పాఠశాలలు నడుస్తున్న సమయంలో రెండో శనివారాల్లో కూడా స్కూళ్లు తెరిచి ఉంచాలని ఆదేశించింది. పెండింగ్ లో ఉన్న పాఠ్యాంశాలను పూర్తి చేయాలని తెలిపంది. ఈ నేపథ్యంలోనే రెండో శనివారం కూడా పాఠశాలలను తెరచి, సంక్రాంతి సెలవులను కూడా కుదించింది.

Tags:    

Similar News