Telangana: 2022-23 బడ్జెట్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్

Telangana: బడ్జెట్ దాదాపు 2లక్షల 50వేల కోట్లు ఉండే ఛాన్స్

Update: 2022-01-23 01:17 GMT

2022-23 బడ్జెట్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్

Telangana: తెలంగాణ సర్కార్ 2022-23 బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ను కూర్పు చేయనుంది. ఈసారి దాదాపు 2లక్షల 50వేల కోట్ల రూపాయలకు తగ్గకుండా తెలంగాణ బడ్జెట్ ఉండే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2021-22 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 30వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రెవెన్యూ గణనీయంగా పెరిగింది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాల ఆదాయ వ్యయాలను భేరీజు వేసుకుని వచ్చే ఆర్ధిక సంవత్సరం కోసం బడ్జెట్ కూర్పు చేయనుంది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల నుంచి ఆర్ధిక శాఖ ప్రతిపాదనలను పంపించాలని అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాలకు మరో 15 రోజుల సమయం ఉండటంతో కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టింది. మరో వైపు కేంద్ర బడ్జెట్ కోసం తెలంగాణ తరపున కేంద్ర ఆర్ధిక మంత్రికి నివేదిక సమర్పించారు.

తెలంగాణ రాష్ట్టంలో అన్ని రంగాలపై కొవిడ్ ప్రభావం చూపడంతో ఆర్ధిక పరిస్తితి అస్తవ్యస్తమైంది. ఆదాయం కూడా భారీగా తగ్గటంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవడంలో ప్రభుత్వం కొంత మేర సఫలం అయ్యింది. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ధరల పెంపు, భూముల అమ్మకం, వాణిజ్య పన్నుల్లో లీకేజీలు అరికట్టడం లాంటి చర్యలు చేపటింది ప్రభుత్వం.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మరో నెలన్నర సమయం ఉండటంతో ఆదాయ వ్యయాలపై ప్రభుత్వానికి ఓస్పష్టత వచ్చింది. గత ఆర్ధిక సంవత్సరం ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది బడ్జెట్ కు అవసరం అయ్యే కేటాయింపుల వివరాలను ఆయా శాఖల నుంచి తీసుకోనుంది. అవన్నీ క్రోడీకరించి 2022-23 బడ్జెట్ అలకేషన్ చేయనున్నది తెలంగాణ ప్రభుత్వం.  

Tags:    

Similar News