Indiramma Housing Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై అదిరపోయే అప్ డేట్.. వాళ్లకి రూ.లక్ష జమ
Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీంపై అదిరపోయే అప్ డేట్.. వాళ్లకి రూ.లక్ష జమ
Indiramma Housing Scheme: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ విధానం ప్రకారం, స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇచ్చే ప్రతిపాదనపై ఇప్పటికే పని జరుగుతుంది. జనవరి 21వ తేది నుంచి ప్రారంభమైన ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం వారికి రూ.లక్ష నగదును జమ చేయనుంది.
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ మొదటి విడత నిధులను రాష్ట్రంలోని పేదల కొరకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద రూపాయి 5 లక్షలు సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిధులు మొదటగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన లబ్దిదారులకు అందించబడతాయి. పునాది వేయడంతో పాటు, ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో కలిసి రూ. 1 లక్ష నగదు మొదటి విడతగా ఇవ్వబడుతుంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత, ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి కోట్లు సిద్దంగా ఉంచింది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద రాష్ట్రంలో 3500 మందికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకం ఆధారంగా ఇంటిగ్రేటెడ్ ఈ-కేవైసీ యాప్ ని ప్రారంభించింది.
దీని ద్వారా సొంతింటి కోసం నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు తమ ఇంటి కేటాయింపు జాబితాలో తమ పేర్లను తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఆధారంగా ఈ యాప్‌లో లాగిన్ చేసి వారు ఇళ్ల కేటాయింపును చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మెరుపు వేగంతో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టబడింది.