TS Election Majority: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది ఆయనే..

TS Election Majority: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకాకు 85,576ఓట్ల మెజారిటీ

Update: 2023-12-04 09:22 GMT

TS Election Majority: తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది ఆయనే..

TS Election Majority: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద నిలిచారు. వివేకానంద 85వేల 576 ఓట్ల మెజారిటీ సాధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6లక్షల 99వేల 783 ఓట్లు ఉండగా... డిసెంబర్ 30న జరిగిన పోలింగ్‌లో 4లక్షల 1,667 ఓట్లు పోలయ్యాయి. కేపీ వివేకానంద మొత్తంగా లక్ష 87వేల 999 ఓట్లు సాధించగా...కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2వేల 423 ఓట్లు పోలయ్యాయి. లక్షా 1,554 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంతరెడ్డికి వచ్చాయి. వివేకాకు ఇంతటి మెజారిటీ రావడానికి ఆయన చేసిన మంచి పనులే కారణమని నియోజకవర్గ ప్రజలంటున్నారు. వివేకా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కార్యకర్త పని మీద తన దగ్గరికి వచ్చినా కాదనకుండా చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది.

Tags:    

Similar News