పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ

రాష్ట్రంలో లాక్ డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా పేద ప్రజలకు, వికలాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసారు.

Update: 2020-03-29 11:08 GMT

రాష్ట్రంలో లాక్ డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా పేద ప్రజలకు, వికలాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసుగుతున్న నేపద్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి. సత్యనారాయణ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను నివారించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎవ్వరు బయటకు రావొద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 67 కరోన కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా 21 రోజులు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉంటే భారతదేశం వ్యాధిని అరికట్టడంలో విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటి వరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 575 మంది కరోనా అనుమానితులను గుర్తించమి తెలిపారు. వారిలో 60% ప్రజలు హోమ్ క్వారం టైన్ లో ఉన్నారన్నారు.

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కొంత మంది మాత్రం అకారణంగా బయటికి వస్తున్నారని ఆయన స్పష్టం చేసారు. వీరిని పర్యవేక్షించడానికి త్వరలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్, బెల్లం పల్లి ఎసిపి రెహ్మాన్, మందమర్రి సిఐ మహేష్ తో పాటు ఎస్ఐలు శివ కుమార్, రవిప్రసాద్, రాములు, దేవయ్యలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News