Telangana: కొనసాగుతున్న తెలంగాణ 'సహకార' ఎన్నికలు

Update: 2020-02-15 03:32 GMT
తెలంగాణ సహకార ఎన్నికలు ఫైల్ ఫోటో

నిజామాబాద్‌ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొస్ర చందూర్‌, కోటగిరి మండలాల్లో ఉన్న ఐదు సహకార సంఘాల్లోని 54 డైరెరక్టర్‌ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఉదయం 7గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంకాగా.. మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248 వార్డులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11.50లక్షల మంది ఓట్లు వేయనున్నారు.

తెలంగాణలో సహకార సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 905 పీఏసీఎస్ ల పరిధిలోని 11 వేల 765 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 157 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 748 సంఘాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా.. తమ మద్ధతుదారులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమించారు. తమ వారిని గెలిపించుకునేందుకు.. నిన్న అర్ధరాత్రి వరకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 747 మంది గెజిటెడ్ అధికారులు.. మరో 20 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎన్నికల ముగిసిన మూడు రోజుల్లో పాలకవర్గాల నియామకాలను చేపట్టనున్నట్టు ఎన్నికల అథారిటీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News