Bhatti Vikramarka: ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన వారోత్సవాలు
Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
Bhatti Vikramarka: ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన వారోత్సవాలు
Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. డిసెబంర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మొదటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రజాపాలన వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు.
డిసెంబర్ రెండో తేదీన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, మూడో తేదీన హుస్నాబాద్ లో, నాల్గవ తేదీన ఆదిలాబాద్, ఐదవ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండ, ఆరు, ఏడో తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారని భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇదే వేదిక ద్వారా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తామని వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దిగ్గజాలు పాల్గొంటారని భట్టి తెలిపారు.