Congress Bus Yatra: ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర
Congress Bus Yatra: బస్సు యాత్రలో ఖర్గే, రాహుల్ పాల్గొనేలా ప్రణాళిక
Congress Bus Yatra: ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర
Congress Bus Yatra: తెలంగాణలో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఈ నెల 15 నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు బస్సు యాత్రలలో పాల్గొననున్నారు. ఈ నెల 9 లేదా 10వ తేదీన జరగబోయే పీఏసీ సమావేశంలో బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేయనుంది టీపీసీసీ.
ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే బస్సు యాత్ర నిర్వహించే ముఖ్యమైన ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ఖర్గే పర్యటించేలా ప్రణాళికను రూపొందించనుంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఈ బస్సు యాత్ర ద్వారా ఆరు గ్యారంటీ స్కీమ్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ.