Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్‌ స్పెషల్ ఫోకస్

CM Revanth on Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2025-09-12 10:23 GMT

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్‌ స్పెషల్ ఫోకస్

CM Revanth on Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు. శాశ్వత ప్రాతిపదికన సెంట్రిక్ ఘాట్స్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేకంగా జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News