నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ వ్యాఖ్యలు: ఏం జరిగింది?
నరేంద్ర మోదీ ఓబీసీ కాదా? ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఫైల్ ఫోటో
నరేంద్ర మోదీ ఓబీసీ కాదా? ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా గతంలో ఇదే ఆరోపణ చేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారా? అసలు వాస్తవం ఏంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
నరేంద్ర మోదీది మోద్ ఘాంచి సామాజిక వర్గం. ఇది తేలి సామాజికవర్గంలో ఉప కులంగా చెబుతారు. ఈ తేలి సామాజిక వర్గంలో మోద్ ఘాంి తో పాటు తేలి సాహు, తేలి రాథోర్, ఘాంచి వంటి ఉప కులాలున్నాయి. తేలి సామాజికవర్గానికి చెందిన వారిలో కొందరు వ్యాపారాలు చేసేవారు. తేలి సామాజికవర్గానికి చెందిన వారు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వీరి సంఖ్య ఎక్కువే. బీహార్, ఛత్తీస్‌గడ్ , జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా ఉన్నారు.
తేలి సామాజిక వర్గంలోని ఘాంచి ఉప కులాన్ని 1999లోనే ఓబీసీ జాబితాలో చేర్చారు. మోద్ ఘాంచి, తేలి సాహు, తేలి రాథోర్ వంటి కులాలను 2000 ఏప్రిల్ 4న ఓబీసీ జాబితాలో చేర్చారు. అయితే ఈ సామాజికవర్గం వెనుకబడినట్టుగా గుజరాత్ ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
మోద్ ఘంచితో పాటు దాని ఉప కులాలను ఓబీసీ 146 కులాల జాబితా 25 బీలో గుజరాత్ ప్రభుత్వం చేర్చింది. 1994 జూలై 25న గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల్ కమిషన్ గుజరాత్ లో సర్వే నిర్వహించింది. మండల్జాబితా 91 (ఎ) లో మోద్ ఘాంచి కులం కూడా ఉంది. 1994 జూలై 25న గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని మాజీ గుజరాత్ డిప్యూటీ సీఎం అమీన్ సోషల్ మీడియాలో 2024 ఫిబ్రవరి 8న పోస్టు పెట్టారు. ఈ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చబిల్ దాస్ మెహతా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.
1997 నవంబర్ 15న జాతీయ బీసీ కులాల కమిషన్ మోద్ ఘాంచి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 1999 అక్టోబర్ 27 మోదీ ఘాంచి సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చుతూ ఓబీసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ నోటిఫికేషన్ జారీ చేసిన రెండేళ్లకు 2001లో మోదీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1992కుముందు ఏ కులాన్ని కూడా ఓబీసీ కేటగిరిలో చేర్చలేదు.