CM Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు మా ప్రభుత్వం కడుతోన్న వడ్డీ ఎంతో తెలుసా?

Update: 2024-12-01 11:06 GMT

CM Revanth Reddy press meet: తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన రైతుల పండగలో పాల్గొన్న రైతులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు ఇచ్చిన ఆశీర్వాదం తమ ప్రభుత్వాన్ని నడిపేందుకు గొప్ప శక్తిగా, ఇంధనంగా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల మద్దతుతో రాబోయే 9 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు. ముఖ్యంగా కొన్ని వాస్తవాలను చర్చించుకుని, ఆ వాస్తవాల ఆధారంగా భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటే రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఒక మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు.

జూన్ 2, 204 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో , 69 వేల కోట్ల రూపాయల అప్పులతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అందివ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. గత పదేళ్లలో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్నీ కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నెల రూ. 6500 కోట్లు వడ్డీ కడుతోందని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో ముఖ్యాంశాలు

గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నాం అని చెబుతూ వెళ్లింది. వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పింది. కానీ తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు రోజులకే డిసెంబర్ 9, 2023 నాడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వైపు నుండి శ్వతపత్రం విడుదల చేశాం. అన్ని వావ్తవాలను లెక్కలతో సహా బయటపెట్టాం. 

Full View


Tags:    

Similar News