Revanth Reddy: హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కేంద్రమంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన సీఎం రేవంత్
Revanth Reddy: హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రులతో ఓ పక్క భేటీ అవుతూనే... నామినేటెడ్, మంత్రి వర్గ విస్తరణ వంటి అంశాలపై అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ NHM 2023-24 ఏడాది మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. NHMలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 231.40 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో సిబ్బందికి ఇబ్బంది కలగకుండా గతేడాది అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. మరోవైపు సోనియాగాంధీతోనూ రేవంత్భేటీ అయ్యారు.