Revanth Reddy: ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్
Revanth Reddy: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి.
Revanth Reddy: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా.. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు సీఎం.
అయితే.. ఈ చీరల పంపిణీ ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. తొలిదశలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నేటి నుంచి ప్రారంభించి.. డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక.. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.