ఉన్నతాధికారులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష సమావేశం...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2020-02-29 13:19 GMT
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మరియు ఇతర అధికారులు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి అందించిన కొత్త ఉత్తర్వుల అమలుపై ప్రతి అధికారి శాఖల వారీగా పూర్తి వివరాలను అందించాలని అధికారులకు తెలిపారు. ఆ వివరాలను మార్చి 4వ తేదీ లోపు సాధారణ పాలనా శాఖకు అందించాలని వివరించారు.

శాసనసభ సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమాధానాలు పంపాలి. అంతే కాక కాగ్‌ నివేదికలో ఉన్న పెండింగ్‌ ఆడిట్‌ పేరాల సమాధానాలను కూడా సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాంతో పాటుగానే జీఏడీ, ఆర్థికశాఖల పరిశీలనకు అనుగుణంగా పోస్టుల వివరాల సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలన్నారు.

బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటారని ఆయన స్పష్టం చేసారు. బడ్జెట్‌ పద్దులు, ఔట్‌ కం బడ్జెట్‌లో సమగ్ర వివరాలు ఉండాలని, ఎలాంటి పరిస్థితిలోనూ దాని విషయంలో నిర్లక్ష్యం కూడదని ఆయన అన్నారు. అన్ని శాఖలకు సంబంధించి బ్రీఫ్‌ ప్రొఫైల్స్‌ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News