Telangana: ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోలు జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైంది.
Telangana: ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోలు జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ క్రమంలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పెద్ద షాక్ ఇచ్చింది. రిజర్వేషన్లను నిలిపివేస్తూ పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో రాజకీయంగా చర్చ మొదలైంది.
హైకోర్టు జీవోలు 9, 41, 42 అమలు నిలిపివేయాలని ఆదేశించింది. పాత విధానం ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండాలని తెలిపింది. అలాగే రిజర్వేషన్ల మొత్తం 50 శాతం మించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ఈ నెల 15న సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో హైకోర్టు తీర్పు, బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని నిర్ణయించింది.
హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం సుప్రీంలో పోరాడుతుందా, లేక పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.