Cabinet Meeting: రేపటి తెలంగాణ కేబినెట్‌ భేటీ వాయిదా

Cabinet Meeting: రేపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది.

Update: 2025-11-06 09:04 GMT

Cabinet Meeting: రేపటి తెలంగాణ కేబినెట్‌ భేటీ వాయిదా

Cabinet Meeting: రేపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 12న తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మరునాడు కేబినెట్‌ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు.

ఈ నెల 24లోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించనుంది. అలాగే.. గిగ్‌ వర్కర్ల బిల్లును కేబినెట్‌ ఆమోదించనుంది. 

Tags:    

Similar News