Adluri Laxman: అహంకారమా? వివక్షా? పొన్నం వ్యాఖ్యలపై లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం
Adluri Laxman: తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం రాజుకుంది.
Adluri Laxman: తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. మాదిగలంటే అంత చిన్న చూపా..? అంటూ నిలదీశారు. తాను మంత్రి కావడం.. ఆ సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా..? అంటూ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌లా అహంకారంతో మాట్లాడడం తనకు రాదన్నారు. పొన్నం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. పొరపాటు ఒప్పుకుని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని అన్నారు.
అదే కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి వివేక్‌కు కూడా చురకలు అంటించారు అడ్లూరి. మీ సహచర దళిత మంత్రిని అంత మాట అంటే.. చూస్తూ ఉంటారా..? అంటూ వివేక్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లి పోతున్నారని, తాను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తానని చెప్పారు అడ్లూరి.