TS BJP: రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు
TS BJP: పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ
TS BJP: రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు
TS BJP: ఆ రెండు టికెట్లు ఎవరికి..? పార్టీని అంటిపెట్టుకున్న నేతలకు ఇస్తారా..? లేక కొత్తగా చేరినా..చేరబోయే నేతలకు ఇస్తారా..? ఖమ్మం, వరంగల్ టికెట్లకు సంబంధించి తెలంగాణ బీజేపీలో ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. పెండింగ్‌లో ఉన్న ఈ రెండు టికెట్లపై క్లారిటీ ఇచ్చేందుకు హస్తినకు వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. రేపు ఢిల్లీలో జరగబోయే బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
వరంగల్ టికెట్ పై కొంతమేరకు క్లారిటీగానే ఉన్నా.. ఖమ్మం స్థానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఖమ్మం టికెట్ ఆశించి కమల దళంలో చేరారు జలగం వెంకట్రావ్. ఇదిలా ఉంటే..బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే చేరికపై ఇప్పటి వరకు ఇటు నామా గానీ..అటు బీజేపీ నాయకులు గానీ స్పందించలేదు. దీంతో ఖమ్మం టికెట్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.