Bathukamma: ప్రపంచ రికార్డుకు ‘బతుకమ్మ’ సిద్ధం
Bathukamma: గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా.. మన బతుకమ్మ పేరిట తెలంగాణ ప్రభుత్వం సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనుంది.
Bathukamma: గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా.. మన బతుకమ్మ పేరిట తెలంగాణ ప్రభుత్వం సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ కీర్తిని నలుమూలలు చాటేలా పర్యాటక శాఖ, జీహెచ్‌ఎంసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
63 ఫీట్ల బతుకమ్మతో, పదివేల మంది మహిళల సమక్షంలో కాసేపట్లో సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కోసం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క తదితర ప్రముఖులు పాల్గొనున్నారు. ఇప్పటికే మహిళలు బృందాలుగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటున్నారు.