Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* దళిత బంధు పథకంపై సుదీర్ఘ చర్చ * చర్చకు స్పీకర్ అనుమతి కోరనున్న కేసీఆర్ * యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ సాగనుంది. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని సీఎం స్పీకర్ ను అనుమతికోరే అవకాశం ఉంది.
అలాగే యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశంపైనా, తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలపైనా, ఉద్యోగాల నియామకంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.