Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana Assembly: తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Update: 2025-08-30 05:15 GMT

Telangana Assembly: తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి నాలుగు నుండి ఐదు రోజుల వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశముంది.

తొలిరోజు ఉభయ సభల్లో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాప తీర్మానాల ద్వారా నివాళులు అర్పించనున్నారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సభలు వాయిదా పడే అవకాశం ఉంది.

సభా వ్యవహారాల కమిటీ (BAC) సమావేశాలు అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా జరగనున్నాయి. ఇందులో సభలు ఎన్ని రోజులపాటు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News