TS Inter Results 2022: విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
Telangana Inter Results 2022 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిలీజ్ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
TS Inter Results 2022: విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
Telangana Inter Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్‌ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.