Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భవం.. రాష్ట్ర అవతరణకు నేటితో 11 ఏళ్లు..

Update: 2025-06-02 02:07 GMT

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భవం.. రాష్ట్ర అవతరణకు నేటితో 11 ఏళ్లు..

Telangana Formation Day: ప్రజల కలల తెలంగాణ ఇప్పుడు 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2న భారతదేశంలోని 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తీరని త్యాగాలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఉద్యమాల అగ్గిన ఓ సాంఘిక ఉద్యమంగా మార్చిన ఉద్యమకారుల సంకల్పంతో ఆవిర్భవించిన తెలంగాణ నేడు అభివ్రుద్ధి పథకంలో దూసుకుపోతోంది. ప్రతి ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ ప్రజల ఆశయాలను స్పూర్తిగా తీసుకుంటోంది. తెలంగాణ చరిత్రలో ప్రతిక్షణం ఒక ఉద్యమమే. నిజాం దైర్యాన్ని ఎదుర్కొంటూ రజాకార్లను అడ్డుకుంటూ భీమ్ లైన ఆదివాసీ వీరులు, చాకలి ఐలమ్మలైన మహిళా యోధులు చేసిన ఆత్మత్యాగాలే ఈ రాష్ట్రానికి పునాది. 1948లో భారత యూనియన్ లో విలీనమైనా, అసమానతలు, అన్యాయం మాత్రం ఇంకా తీరలేదు. 1956లో భాష ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో తెలంగాణను ఆంధ్రలో కలపడం మొదటి తప్పుయ్యింది. అప్పటి హామీలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. మన ఉద్యోగాలు, నీళ్లు, వనరులు అన్నీ మర్చిపోయారు. మన యాసను చిన్నచూపు చూశారు. మన పండగలకు ఎక్కడా చోటులేకుండా పోయింది. విద్యార్థుల గుండెల్లో, రైతుల నేస్తాల్లో రగిలిన ఆ బాధ..1969లో జ్వాలలై విసిరింది.

జై తెలంగాణ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిధ్వనించిన వేళ..విద్యార్థుల రక్తంతో మంటలై నేలపుట్టింది. ఆ చరిత్ర తుడిచిపెట్టలేనిది. 1969లో తొలిసారి ఉద్యమం విరుచుకుపడినప్పుడు అది తాత్కాలిక అవేశం కాదు..అది తరతరాల తపన. అప్పటి యువకుల త్యాగాలకే ఈ రోజు మనం సాహసంగా తెలంగాణ అనే గర్వాన్ని పలుకగలుగుతున్నాం. మళ్లీ 2000 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం వరకు విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు రైతు నుంచి రచయిత వరకు ప్రతి ఒక్కరూ గళం విప్పారు..

2014 జూన్ 2..ఆ రోజు ప్రజల గుండె చాలా ధైర్యంతో నిండిపోయింది ప్రజల కన్నీళ్లలో ఆశ వెదజల్లింది. ఆ రోజు తెలంగాణ కల నిజమైంది. ఇది కేవలం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన వేళ కాదు..ఇది ఆత్మగౌరవానికి పునాదిరాయి. వేలాది మంది యువకులు ఇచ్చిన ప్రాణత్యాగానికి, తల్లుల తడిచిన అంచులకు, పల్లలె నుంచి వచ్చిన కేకలకు, ఒక జవాబు లభించిన క్షణం. ఈ రోజు తెలంగాణ ఓ వైభవంగా నిలిచింది. ఉద్యమాల ఆత్మను సజీవంగా ఉంచుతూ..అభివ్రుద్ధి ప్రగతి బాట పట్టింది. జూన్ 2 అంటే పండగ కాదు..మన గుండె తడిచే రోజు. ప్రతి కుటుంబం ఓ యోధుని వలే గర్వించదగ్గ రోజు. 

Tags:    

Similar News