Telangana: టెన్త్‌ క్లాస్‌లో అంతా పాస్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Update: 2021-05-11 15:08 GMT

విద్యార్థులు (ఫొటో ట్విట్టర్) 

Telangana: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరందరికీ గ్రేడ్లను ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు జీవోలో పేర్కొంది. కరోనా కారణంగా పది, ఇంటర్‌ పరీక్షలను ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా స్టూడెంట్లను ఉత్తీర్ణులను చేస్తూ జీవో జారీ చేసింది. ఈ ఫలితాలపై ఎవరికైనా అభ్యతరాలు ఉంటే పరీక్షలకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా ప్రమోట్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. జూన్‌ రెండో వారంలో సమావేశమై.. సెకండ్ ఇయర్ పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకుంటామంది. అలాగే బ్యాక్‌లాగ్‌ ఉన్న సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు కనీస పాస్‌ మార్కులు వేసి పాస్ చేస్తామని గతంలో ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News