TG SSC Results: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా

Update: 2025-04-30 01:57 GMT

TG SSC Results: నేడు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రవీంధ్ర భారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేస్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. క్రిష్ణారావు తెలిపారు. ఈ సారి జీపీఏ విధానాన్ని తొలగించినందుకు సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు.

కనీస మార్కులు వచ్చే ఉత్తీర్ణత అని లేదంటే ఫెయిల్ అయిన మార్కుల మెమోపై నమోదు చేస్తారు. ఫలితాలను https://bse.telangana.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ టెన్త్ 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్‌మిట్ కొట్టాలి. ఇక్కడ మార్కుల వివరాలను డిస్ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల కాపీని తీసుకోవచ్చు.

ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల కోసం 5,09, 403 మంది రిజిస్టర్ చేసుకోగా... మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు ఈ విద్యార్థులంతా ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ఏప్రిల్ 7నుంచి ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.

గత ఏడాది ఏప్రిల్ 2తో పదవ తరగతి పరీక్ష ఫలితాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రకటించింది విద్యాశాఖ. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో పరీక్షలు పూర్తయ్యాయి. ఈ సారి కూడా ఏప్రిల్ 30వ తేదీన ప్రకటిస్తున్నారు. ఫలితాలను ప్రకటించిన వెంటనే సప్లిమెంటరీ పరీక్ష తేదీలతోపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీల వివరాలను ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News