ఇకపై నగరంలో ఏసీ బస్ షెల్టర్లు : తలసాని

హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం నగరంలోని బస్ షెల్టర్ లకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తలసాని తెలిపారు.

Update: 2020-11-16 12:05 GMT

హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం నగరంలోని బస్ షెల్టర్ లకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తలసాని తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట నూతనంగా నిర్మించిన AC బస్ షెల్టర్ ను MLA సాయన్న, కార్పొరేటర్ ఆకుల రూప, అధికారులతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ మంత్రి KTR పర్యవేక్షణలో ప్రధాన కూడళ్లలో ని బస్ షెల్టర్ లలో AC సౌకర్యం తో పాటు సెల్ ఛార్జర్, CC కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో 292 బస్ షెల్టర్ ల ఆధునీకరణ పూర్తయిందని, ఇందులో 4 AC బస్ షెల్టర్లు ఉన్నాయని చెప్పారు. నగరానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని, పారిశుద్ధ్య పరిరక్షణ లో భాగంగా అనేక చోట్ల టాయిలెట్స్ ను నిర్మించినట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News