Talasani Srinivas Yadav: సింగరేణిపై ప్రధాని మోడీ మాట తప్పారు
Talasani Srinivas Yadav: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
Talasani Srinivas Yadav: సింగరేణిపై ప్రధాని మోడీ మాట తప్పారు
Talasani Srinivas Yadav: హైదరాబాద్ నగరంలో డివిజన్ల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి అనే అంశాలపై చర్చ జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ సచివాలయాన్ని పూర్తి చేశారన్నారు. సింగరేణిపై ప్రధాని మోడీ ఇచ్చిన మాట తప్పారని.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పలేదా అంటూ ప్రశ్నించారు.
టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించిందని..అందులో భాగంగానే సంబంధమున్న ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేశామన్నారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి తలసాని.