కాంగ్రెస్‌ నేతలకు సవాల్ విసిరిన మంత్రి తలసాని

Update: 2020-03-08 02:40 GMT
Talasani File Photo

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌ అంశంపై మంత్రి తలసాని స్పందించారు. మంత్రి కేటీఆర్ 111 జీవో ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలే అన్నారు. ఎవరు జీవోను ఉల్లంఘించారో చర్చకు సిద్ధమనీ, కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని సవాల్‌ తలసాని విసిరారు.

కేటీఆర్‌ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఆయన చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేసింది వాస్తవం కాదా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం మధ్యాహ్నం కేటీఆర్ ఫాం హౌస్ ముట్టడికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, జన్వాడ వద్ద రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డితోసహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

మంత్రి కేటీ‍ఆర్‌ జీవోలను ఉల్లంఘించి అక్రమంగా భవనాలు కట్టారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్ర నిబంధనలను తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. కాగా.. కేటీఆర్ ఫాంహౌస్‌ను కొందరూ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.

 

Tags:    

Similar News