వీణా-వాణికి టెన్త్ క్లాస్ పరీక్షలు.. సతమతంలో ssc బోర్డు

అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణిలను విడదీసేందుకు దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణలు ఎన్నో సార్లు పరీక్షించారు.

Update: 2020-02-21 14:24 GMT

అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణిలను విడదీసేందుకు దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణలు ఎన్నో సార్లు పరీక్షించారు. వీరిద్దరిని విడదీసేందుకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని దానికి సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో వారిని విడదీసే ప్రయత్నాలు మరుగునపడ్డాయి. వారికి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వారిద్దరిని నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోంకు తరలించింది ప్రభుత్వం. అక్కడ వారి ఆలనా పాలనా చూడడం మాత్రమే కాదు వారు చదువుకు కావలసని అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. వీరి కోసం ప్రత్యేకంగా టీచర్లను, ట్యూటర్లను నియమించి వారు ఉన్న స్టేట్ హోంలోనే పాఠాలు చెప్పించింది.

ఇక తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అవిభక్త కవలలు వీణా-వాణి పదో తరగతి పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వారిద్దికి ssc పరీక్షల్లో వేరు వేరు హాల్ టికెట్లు జారీ చేయాలా, లేదంటే తలలు కలిసి ఉన్నాయి కాబట్టి వారిద్దరిని ఒక్కరిలా పరిణగించి ఒకే హాల్ టికెట్ ఇవ్వాలా అన్న విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు.

ఈ విషయంపై సుమారుగా 4 నెలలనుంచి సమాలోచనలు చేస్తున్నారని అయినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని వారు తెలిపారు. ఇక పోతే పదో తరగతి పరీక్షలకు మరో 27 రోజులు మాత్రమే గడువుండి, మరో 5 రోజుల్లో హాల్ టికెట్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుండడంతో అదికారులు ఏం చేయాలో ఆలోచించోకోలేక పోతున్నారు.

ఇక ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీణా-వాణిలకు బర్త్‌ సర్టిఫికెట్‌ వేర్వేరుగా ఇచ్చారని, అదే విధంగా హాల్‌ టికెట్లు కూడా విడివిడిగా జారీ చేయాలని అంటున్నారు. ఈ విషయంలో అధికారులు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి త్వరగా హాల్‌టికెట్లు ఇవ్వాలని, వారికి పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి పరీక్షలు రాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News