TPCC President: మళ్లీ తెరపైకి వచ్చిన టీపీసీసీ చీఫ్ వ్యవహారం

TPCC President: టీపీసీసీ ఎంపిక విషయంలో మానికం ఠాగూర్ మరోసారి కసరత్తు ప్రారంభించారు.

Update: 2021-06-03 04:57 GMT

TPCC President:(The Hans India)

TPCC: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సంస్థాగత అంశాపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల నాయకుల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారానికి సీనియర్‌ నేతలను రంగంలోకి దింపింది. ఇదిలా వుంటే టీపీసీసీ ఎంపిక విషయంలో మానికం ఠాగూర్ మరోసారి కసరత్తు ప్రారంభించారు. ఈ విషయమై సోనియాగాంధీతో చర్చించనున్నట్లు సమచారం. దీంతో రెండు లేదా మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం.

తెలంగాణ పీసీసీ సారథ్యంపై గతంలోనే ఏఐసీసీ అభిప్రాయ సేకరణ జరిపిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ముందు దీనిపై ప్రకటన చేయవద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం పీసీసీ నియామకానికి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో అధ్యక్షుడిని నియమించే సంకేతాలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

2022లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గుజరాత్‌, గోవా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలపై కాంగ్రెస్‌ పెద్దలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష, కార్యవర్గాల భర్తీకి కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. మరి చివరి నిమిషంలో ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏదీ ఏమైనప్పటి కొత్త పీసీసీని వెంటనే ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ని కొత్త ఉత్సాహంతో పరిగెత్తించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News