Supreme Court: ఆ 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్‌గా పరిగణించొద్దు.. సుప్రీం ఉత్తర్వులు
Supreme Court on Tribal Case: తమ గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
Supreme Court on Tribal Case: తమ గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ సుప్రీంకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నిజాం ఆర్డర్ ఆధారంగా ట్రైబల్ గ్రామాలుగా పరిగణించాలని ఇటీవల హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేసిన గ్రామానికి చెందిన నాన్ ట్రైబల్స్.. 2013లో సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్‌లో మంగపేటలోని 23 గ్రామాలు లేవు అని సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మహేశ్వరి ధర్మాసనం.. ఆ 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దని స్పష్టం చేసింది.