ఇంటర్ ఫలితాల గందరగోళం పై సుప్రీంలో విచారణ నేడు

Update: 2019-07-08 04:35 GMT

తెలంగాణా ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్ట్ లో విచారణ జరగనుంది. ఇంటర్ ఫలితాల సందర్భంగా గందరగోళం చెలరేగడం.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై కూలంకష విచారణ అవసరమనీ, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగంమాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

Tags:    

Similar News