తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక మలుపు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Telangana: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్ మధ్య వివాదం అనేక మలుపులు తిరుగుతోంది.

Update: 2023-03-21 10:23 GMT

తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక మలుపు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Telangana: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్ మధ్య వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తెలంగాణలో కీలక పెండింగ్‌ బిల్లులను గవర్నర్ తమిళిసై తన దగ్గరే అట్టిపెట్టుకొని ఆమోదం తెలపడకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో 10 కీలక పెండింగ్ బిల్లులపై సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Tags:    

Similar News