రోగులకు సెక్యూరిటీ సిబ్బంది, స్వీపరు వైద్య సేవలు

Update: 2019-06-09 13:06 GMT

ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులకు కొంత ఆదరణ పెరుగుతోంది. అయినా వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. డాక్టర్ల డుమ్మా రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వారిలో మాత్రం చలనం రావడం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో సెక్యూరిటీ గార్డులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో కనీసం సెలెన్ బాటిల్ ఎక్కించడానికి నర్సులు కూడా ఉండటం లేదు. చేసేదేమి లేక సెక్యూరిటీ గార్డే సెలైన్ ఎక్కిస్తున్నాడు. రోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ మండిపడుతున్నారు. 

Tags:    

Similar News