Srinivas Goud: పౌరుషం లేకపోతే హుస్సేన్‌సాగర్‌లో దూకైనా చద్దాం.. మీకు చేతకాకపోతే నేనే సిద్ధమైతా..
Srinivas Goud: సోషల్ మీడియాలో తనపై వచ్చిన కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Srinivas Goud: పౌరుషం లేకపోతే హుస్సేన్‌సాగర్‌లో దూకైనా చద్దాం.. మీకు చేతకాకపోతే నేనే సిద్ధమైతా..
Srinivas Goud: సోషల్ మీడియాలో తనపై వచ్చిన కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చిక్కడపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన నన్ను వాడు వీడు అంటుంటే మన జాతి నిద్ర పోతుందా అంటూ ప్రశ్నించారు. తనపై దాడి వాడు వీడు అంటే.. బహుజనులపై దాడి చేసినట్లే అన్నారు. మన జాతి పౌరుషం ఇంతేనా అన్న శ్రీనివాస్ గౌడ్.. చేతకాకపోతే అందరం కట్టకట్టుకొని హుస్సేన్ సాగర్‌లో దూకైనా చద్దామంటూ వ్యాఖ్యలు చేశారు. మన జాతిని కాపాడుకునేందుకు అన్నీ ఓర్చుకుంటూ వస్తున్నానని.. వెనుకనుంచి పొడిచినా తట్టుకుంటున్నానని.. ఎదురుదాడికి చేతకాకపోతే తానే సిద్ధమవుతానన్నారు శ్రీనివాస్ గౌడ్.