Srinivas Goud: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Srinivas Goud: ఇషా సింగ్, నిఖత్ జరీన్ తెలంగాణవారని కిషన్ రెడ్డి గ్రహించాలి

Update: 2023-05-28 07:32 GMT

Srinivas Goud: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Srinivas Goud: క్రీడల విషయంలో రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై... రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర స్థాయి సీఎం కేసీఆర్ కప్ పోటీలను ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తో కలిసి రాష్ట్ర మంత్రి ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతిభను గుర్తించాలని ప్రతి సంవత్సరం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు... సీఎం కప్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మంచి క్రీడా పాలసీనీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశానికి సరిపడా క్రీడాకారులను అందించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుతోందని తెలిపారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇన్ని చేస్తుంటే కిషన్ రెడ్డి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు.

ఇషా సింగ్, నిఖత్ జరీన్ తెలంగాణకు చెందిన వారే అన్న విషయాన్ని కిషన్ రెడ్డి గ్రహించాలని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం క్రీడా ప్రాంగణాలు లేవని... గెలిచిన వారికి 2 కోట్లు ఇస్తున్నామని... గతంలో గెలిచిన వారికి 20 లక్షలు మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. చెస్, బాక్సింగ్ లో వరల్డ్ చాంపియన్ షిప్ సాధించామని...

నిన్న పరేడ్ మైదానంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించ పరిచే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో కామన్ వెల్త్ , ఒలింపిక్స్ లలో మెడల్స్ ఎందుకు రావట్లేదని... వీటి అన్నింటికీ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని... శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News