తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి..

Update: 2019-06-22 03:39 GMT

వారం ఆలస్యం అన్నారు. కేరళను దాటిందన్నారు. పది రోజులైనా జాడే కనిపించడం లేదన్నారు. ఇవాళో రేపో వస్తాయన్నారు. ఆలస్యమైనా ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. తొలకరితో తెలుగు నేల పులకించిపోయింది. ఏపీలోని రాయలసీమ, దక్షిణాంధ్రతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాదికన్నా 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఈ సారి వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ నెలలో మాత్రం వర్షపాతం తక్కువగానే ఉంటుందని వచ్చే నెలలో అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించారు.

మరోవైపు తొలకరిని ఎదురుచూసిన అన్నదాతలు వర్షాలు కురవడంతో ఆనందంతో పొలం బాట పట్టారు. ఖరీఫ్‌ పనులు ముమ్మరం చేశారు. తెలంగాణలో 1.12 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ పనులు జరుగుతాయని వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక అంచనా వేసింది. ఈసారి ఆలస్యంగానైనా సాధారణ వర్షాలు కురుస్తాయని, గోదావరి జలాలతో వరి సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల దిగుబడి పెరగవచ్చని వ్యవసాయశాఖ భావిస్తోంది. 

Tags:    

Similar News