భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం:శిథిలాల కింద ఆరుగురు

భద్రాచలంలో బుధవారం ఆరంతస్తుల భవనం కుప్పకూలింది

Update: 2025-03-26 09:59 GMT

భద్రాచలంలో బుధవారం ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నారని సమాచారం. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.  శిథిలాలను తొలగించి భవన శిథిలాల కింద చిక్కకున్న వారిని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

పాత భవనంపైనే నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఆలయం కూడా నిర్మిస్తున్నారు.రెండేళ్లుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

భద్రాచలం ఆలయ అధికారులు, పంచాయితీ అధికారులు ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన సమయంలో కొన్ని రోజుల పాటు నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో ఈ నిర్మాణ పనుల్లో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. అయితే నాలుగైదు రోజులుగా ఈ భవనం వద్ద ఒకరిద్దరూ మాత్రమే పనిచేస్తున్నారు.

Tags:    

Similar News