షాద్ నగర్ లో గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు:ఆరుగురు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరురుగు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు.
షాద్ నగర్ లో గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు:ఆరుగురు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరురుగు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు విషయం తెలిసిన పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో చనిపోయినవారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
షాద్ నగర్ ప్రమాదంపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
షాద్ నగర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.