ప్రేమికులకు పెళ్లి.. యువతి తండ్రి షాక్..

Update: 2019-02-15 04:19 GMT

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొందరు ప్రేమికులకు బలవంతంగా పెళ్లిచేశారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఈ క్రమంలో ఆక్సిజన్ పార్కులో తిరుగుతున్న యువతీ, యువకుడిని పట్టుకొని అతనిచేత బలవంతంగా తాళి కట్టించారు. ఈ బలవంతపు పెళ్లి తంతు అంతా వీడియో తీసి, సెల్ఫీలు కూడా దిగారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు బజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బలవంతపు పెళ్లి చేసిన శ్రీహరిచారి, ఆనంద్, అవినాష్, అశోక్, సురేష్ కుమార్, చంద్రశేఖర్ లను గుర్తించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బలవంతపు పెళ్లి ఘటనలో బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము కేసు నమోదు చేశారు. తన కూతురు కళాశాలకు వెళ్లి అక్కడి నుంచి తన దూరపు బంధువు రాకేష్ అనే యువకుడితో పార్కుకు వెళ్లిందని.. అయితే వారిద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Similar News