TSPSC: ముగ్గురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనున్న సిట్‌

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్ దూకుడు

Update: 2023-04-04 03:35 GMT

TSPSC: ముగ్గురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనున్న సిట్‌

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ లో లింకులతో పాటు.. బాధ్యులెవరనే అంశాలపై కూపీ లాగుతోంది.ముగ్గురు నిందితులను సిట్ ఇవాళ కస్టడీకి తీసుకోనుంది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకోనున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యను విచారించనున్నారు.

టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని విచారించింది సిట్. ప్రశ్నపత్రాలను సురక్షితంగా ఉంచాల్సిన కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారు? శంకర్ లక్ష్మి ప్రతిరోజు ఎవరికి రిపోర్టు చేయాలి? అనే అంశాలపై ఇప్పటికే సిట్ అధికారులు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి నుంచి కొంత సమాచారం సేకరించారు. మరింత సమాచారం కోసం కమిషన్ చైర్మన్ ను విచారించారు.

దాదాపు మూడు గంటల పాటు జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించిన సిట్.. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ నుండి స్వాధీనం చేసుకున్న లాప్ టాప్ లతో వచ్చిన సిట్ అధికారులు జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 

Tags:    

Similar News