Rajanna Sircilla: ప్రజాప్రతినిధుల సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం.. స్పీచ్ ఇస్తున్నా సెల్ ఫోన్ చాటింగ్‌లో బిజీ

Rajanna Sircilla: ప్రజాప్రభుత్వం అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతీ సందర్భంలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా..

Update: 2025-11-21 06:37 GMT

Rajanna Sircilla: ప్రజాప్రతినిధుల సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం.. స్పీచ్ ఇస్తున్నా సెల్ ఫోన్ చాటింగ్‌లో బిజీ

Rajanna Sircilla: ప్రజాప్రభుత్వం అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతీ సందర్భంలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా.. అధికారులు మాత్రం ఇవేమీ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట, జిల్లా, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో ఉన్నతాధికారులు., ప్రజాప్రతినిధులు చెబుతున్న సూచనలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులు తమకేమీ పట్టనట్టుగా సెల్ ఫోన్ చాటింగ్ లో నిమగ్నమయ్యారు. సెల్ ఫోన్లలో నిమగ్నమైన అధికారులను చూస్తూ వేదికపై ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సైతం సమావేశం ముగించుకొని వెళ్లిపోయారు. ముఖ్యమైన సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News